VIDEO: కార్పొరేటర్‌కు ఫుడ్‌కోర్టు వ్యాపారులు వార్నింగ్
VSP: ప్రభుత్వం ఫుడ్ కోర్టు వ్యాపారస్తులకు మంజూరు చేసిన రూ. 6 కోట్లను ఇవ్వడానికి వీలు కాదంటూ కార్పొరేటర్ పీతల మూర్తి GVMC కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద గురువారం రాత్రి బాధితులంతా ఆందోళన చేశారు. ఫుడ్ కోర్టు వ్యాపారస్తుల జోలికి వస్తే పీతల మూర్తిని ఇంటికి వెళ్లి చెప్పులతో కొడతామని హెచ్చరించారు.