అందుకే HYDలో భూముల ధరలు పెరిగాయి: సీఎం

అందుకే HYDలో భూముల ధరలు పెరిగాయి: సీఎం

AP: అభివృద్ధి జరిగితే భూముల ధరలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగింది కాబట్టే భూముల ధరలు పెరిగాయని అన్నారు. ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం ఉండేదని.. కానీ, ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని చెప్పారు. ఏపీలోనూ భవిష్యత్తులో అలాంటి రోజులు వస్తాయని వెల్లడించారు.