అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వాహనం పట్టివేత

అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వాహనం పట్టివేత

ASF: చింతలమానేపల్లి మండలంలోని డబ్బాలో గురువారం అక్రమంగా తరలిస్తున్న రెండు ఎద్దులు, ఒక ఆవు దూడను హిందు వాహిని సభ్యులు పట్టుకున్నారు. డబ్బా గ్రామం నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా డబ్బా ఎక్స్ రోడ్ వద్ద పట్టుకోని పోలీసులకు సమాచారం అందించినట్లు హిందూ వాహిని సభ్యులు తెలిపారు. అక్రమంగా పశువులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.