జిల్లాలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

PPM: వీరఘట్టం మేజర్ పంచాయతీలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి నీటిపారుదల శాఖ కార్యాలయం వరకు రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాలువలు లేకపోవడంతో 15 రోజులుగా మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పక్కాగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.