మానవీయ సేవాభావాన్ని చాటిన అధికారి

మానవీయ సేవాభావాన్ని చాటిన అధికారి

మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మెదక్ మండలం పాతూర్ గ్రామ పోలింగ్ బూత్ వద్ద పోలీసులు మానవీయ సేవాభావాన్ని చాటారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ సుగెందర్ చేతులపై ఎత్తుకొని సురక్షితంగా బూత్ వరకు తీసుకెళ్లారు.