నవంబర్ 4న కలెక్టరేట్ల ముట్టడి

నవంబర్ 4న కలెక్టరేట్ల ముట్టడి

TG: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నవంబరు 4న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌లను ముట్టడించనున్నారు. సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజులు, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ వివరాలు వెల్లడించారు.