హెలిప్యాడ్ నిందితుల రిమాండ్‌కు కోర్టు నిరాకరణ

హెలిప్యాడ్ నిందితుల రిమాండ్‌కు కోర్టు నిరాకరణ

AP: జగన్ హెలిప్యాడ్ కేసులో నిందితులను ధర్మవరం మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. పది మంది నిందితులకు రిమాండ్ విధించాలని అధికారులు కోర్టును కోరారు. ఈ సందర్భంగా రిమాండ్‌కు నిందితుల తరపు లాయర్లు అభ్యంతరం తెలుపుతూ.. ఇప్పటికే కొందరికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్లు వివరించారు. హైకోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన జడ్జి.. నిందితుల రిమాండ్‌కు నిరాకరించారు.