రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి పర్యటన

NGKL: తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్, రామకృష్ణాపురం గ్రామంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు దేవుని పడక శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవంతం చేయాలని కోరారు.