పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ

KMR: బాన్సువాడ పోలీస్ స్టేషన్ను నేడు ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట సీఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.