'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

KMM: గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో సీఐ సమావేశం నిర్వహించారు. స్థల దాత అంగీకార పత్రంతోపాటు విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు సమర్పించాలని చెప్పారు. అటు DJలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.