పోయిన సెల్‌ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు
PLD: చిలకలూరిపేట పోలీసులు పోయిన మొబైల్ ఫోన్లను వెలికితీశారు. సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 10 ఫోన్లను రికవరీ చేసిన ఎస్సై అనిల్ కుమార్ వాటిని బాధితులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఫోన్లు దొరకడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.