అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో శనివారం కీర్తి చంద్ర బెహరా ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రిఫ్రిజిరేటర్, ధ్రువపత్రాలు, సుమారు రూ.70 వేల నగదు, బంగారం, ఇతర వస్తువులు కాలిపోయాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.