భారత్, పాక్, ఆఫ్ఘన్‌లో భారీ వర్షాలు
భారత్, పాక్, ఆఫ్ఘన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సాధారణంగా మార్చి నెలలో వేసవితాపం ఉంటుంది. ఈసారి అసాధరణంగా వడగండ్ల వానలు పడుతున్నాయి. వాతావరణ మార్పుకు పశ్చిమ గాలులు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ గాలులు ఆఫ్ఘాన్, పాక్ మీదుగా భారత్ వరకు 1000 కి.మీ రెయిన్ బ్యాండ్ విస్తరించడంతో ఇలా జరుగుతోందన్నారు. వానలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.