శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎస్.రెడ్డీ సాహెబ్
అన్నమయ్య: మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నరు.