దేరశాంలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

దేరశాంలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

SKLM: రణస్థలం మండలం దేరశాంలో నల్ల చెరువు, నేరేడు చెరువుల్లో ఈ ఏడాదికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం పనులను సోమవారం స్థానిక ఎంపీటీసీ సభ్యులు దన్నాన వంశీకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా పనులకు వచ్చేవారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో కూటమి నేతలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.