11న 2వేల మందికి ఉచిత సైకిళ్లు పంపిణీ: మంత్రి
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ కుమార్తె పేరుతో నిర్వహించే 'సంస్కృతి' సేవా సంస్థ ద్వారా ధర్మవరంలో 2 వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 11న మధ్యప్రదేశ్ CM మోహన్ యాదవ్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరగనుంది. దీని కోసం రూ.98 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగ యువతకు సివిల్స్, బ్యాంకింగ్ రంగాలలో ఉచిత శిక్షణ కూడా ఇప్పించనున్నారు.