తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి
ATP: జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఉత్తర్వులు అందించారు. జడ్పీ కార్యాలయంలోని ఆమె చాంబర్‌లో పదోన్నతి పొందిన తొమ్మిది మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధ్యతగా పనిచేయాలని సూచించారు.