మద్యపాన నియంత్రణపై గ్రామస్థుల విజ్ఞప్తి

మద్యపాన నియంత్రణపై గ్రామస్థుల విజ్ఞప్తి

JN: లింగాల ఘనపురం మండలం కళ్లెం గ్రామంలో యువత మద్యపానానికి బానిసగా మారుతున్న నేపథ్యంలో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే మద్యం సేవించడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మద్యపాన దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే తెరవాలని గ్రామ సర్పంచ్‌ను కోరారు.