నేడు, రేపు నీటి సరఫరాలో అంతరాయం

నేడు, రేపు  నీటి సరఫరాలో అంతరాయం

PDPL: రామగుండం కార్పొరేషన్‌లో నేడు, రేపు, నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న నీటి సరఫరా జరిగే ప్రాంతాలకు 9న, అలాగే 9న నీటి సరఫరా జరిగే ప్రాంతాలకు 10వ తేదీన నీటి సరఫరా ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పైప్లాన్ మరమ్మతుల నేపథ్యంలో కార్పొరేషన్ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.