పాఠశాల ప్రహరీ గోడ నిర్మించండి సారూ.!

పాఠశాల ప్రహరీ గోడ నిర్మించండి సారూ.!

NDL: సంజామల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(మెయిన్) చుట్టూ ప్రహరీ గోడ లేక విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణంలోనే ప్రధాన రహదారి ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు.