'ఇంటి పన్నులు లక్ష్యాన్ని పూర్తి చేయాలి'
ప్రకాశం: ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. తాళ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం గ్రామ కార్యదర్శుల నమావేశం నిర్వహించారు. పన్నుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి నేరుగా క్యూఆర్ స్కాన్ చేయించి పన్నులు వనూలు చెయ్యాలని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తిచెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.