భారత్‌కు చేరాల్సిన ఇరాన్ చమురు.. చైనాకు

భారత్‌కు చేరాల్సిన ఇరాన్ చమురు.. చైనాకు

భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళుతున్నట్లు షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈనెల 4న గుజరాత్‌లోని వడినర్ నౌకాశ్రయానికి ఈ నౌక చేరుకోవాల్సి ఉంది. అమెరికా ఆంక్షలతో 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తివేసింది.