జిల్లాలో ఆకస్మిక వాహన తనిఖీలు
విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 140 ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రంగా లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేశామన్నారు.