సమాజ సేవలో ముందుకు సాగాలి: అర్బన్ ఎమ్మెల్యే
NZB: ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ, సమాజ సేవలో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, కార్యాచరణపైకార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.