రేపు సోలార్ యూనిట్ల పంపిణీ..!
TPT: వెంకటగిరి పట్టణ పరిధిలోని బొప్పాపురం, అమ్మవారి పేట ప్రాంతాల్లో రేపు ఉదయం 9 గంటలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్ల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించనున్నారు. SC, ST వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన మొత్తం 75 మంది లబ్ధిదారులకు సుమారు రూ.92.28 లక్షల విలువైన 2 కిలోవాట్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.