VIDEO: వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం

VIDEO: వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం

KDP: పులివెందులలోని శ్రీ చక్ర సహిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుడు రామ్ కుమార్ శర్మ పరమశివుడికి సంకల్పం చేసి దీపారాధన చేశారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు జ్వాలా తోరణాన్ని వెలిగించారు.