నిషేధాజ్ఞలు TDP నాయకులకు వర్తించవా?

NLR: ఉలవపాడు(M) కరేడులో పోలీస్ అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటి కన్వీనర్ మిరియం శ్రీనివాసులు విమర్శించారు. పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ల పేరుతో రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఇతర ప్రాంత నాయకులను అధికారులు అడ్డుకుంటున్నారని, ఆ నిషేధాజ్ఞలు TDP నాయకులకు వర్తించవా, ఇష్టానుసారంగా రావడానికి అనుమతి ఎవరు ఇస్తున్నారని అని ప్రశ్నించారు.