చీరాలకు 10 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే

చీరాలకు 10 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే

BPT: చీరాల నియోజకవర్గంలో ఆయా మండలాలలోని గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపీ పాలనలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.