VIDEO: గద్వాల రైల్వే స్టేషన్‌లో రద్దీ సమస్య
గద్వాల రైల్వే స్టేషన్లో హంద్రీ ఎక్స్ప్రెస్ సమయానికి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. టికెట్ల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ సమస్యను తగ్గించేందుకు అదనపు టికెట్ కౌంటర్లు, ATVM యంత్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలని వారు అధికారుల నుంచి కోరుతున్నారు.