నిద్ర లేవగానే చూడాల్సిన వస్తువులు!
ఉదయం నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూడటం వల్ల ఆ రోజంతా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రధానంగా బంగారం, ఉదయపు సూర్యుడు, ఎర్ర చందనం చూడటం శుభప్రదమని సూచిస్తున్నారు. అలాగే ఆలయ గోపురం, దూడతో ఉన్న ఆవును చూడటమూ మంచిదేనంటున్నారు. అయితే ఎంగిలి పాత్రలు, గడియారం, అద్దం, నీడ, జంతువులను చూడొద్దని.. ఇవి ఆ రోజును చిరాకు, ఆందోళనకరంగా మారుస్తాయని హెచ్చరిస్తున్నారు.