VIDEO: మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

NLG: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లో నేడు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.