స్క్రబ్ టైఫస్‌పై జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ సూచన

స్క్రబ్ టైఫస్‌పై జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ సూచన

సత్యసాయి: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని చెప్పారు. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే పూర్తిగా నయం అవుతుందని అన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.