ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
ELR: గణపవరం మండలం పిప్పర ZP హైస్కూల్లో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ శ్రీ దివ్య డయాబెటీస్ పై అవగాహన కల్పించారు. అలాగే డయాబెటిక్ రాకుండా తీసుకోవలసిన నియమాలు, పాటించాల్సిన ఆహార పద్ధతులు, వ్యాయామల ప్రాముఖ్యత గురించి వివరించారు.