గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్
NDL: జిల్లాలో LPG గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ జి.రాజకుమారి స్పష్టం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రోజుకు సగటున 5,500 బుకింగ్స్ జరుగుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10,000కు చేరిందని తెలిపారు. అనవసర భయాందోళనల వల్లే బుకింగ్స్ పెరిగాయని, అవసరానికి మించి గ్యాస్ బుక్ చేయొద్దని ప్రజలను కోరారు.