'సురక్షిత శృంగారం వలన ఎయిడ్స్‌ను అరికట్టవచ్చు'
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్. ఆయేషా తశ్నిమ్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. సుఖవ్యాధులు ఉన్నవారికి ఎయిడ్స్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సురక్షిత శృంగారం వలన ఎయిడ్స్‌ను అరికట్టవచ్చునని తెలిపారు. కండోమ్స్ యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.