పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం

పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం

VZM: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా సేవలందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు చదవడం, వ్రాయడం రావాలని, ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదన్నారు. ఇది స్వచ్ఛంద సేవ మాత్రమేనని, జీతభత్యాలు ఉండవని స్పష్టం చేశారు.