'తల్లిదండ్రుల ప్రవర్తన ఆదర్శంగా నిలవాలి'
కృష్ణా: తల్లిదండ్రులు ప్రవర్తన వారి బిడ్డ లకు ఆదర్శంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నం నగరంలోని కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. పిల్లలు వారి తల్లిదండ్రుల ప్రవర్తన చూస్తూ ఎదుగుతారన్నారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు తపనతో కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు.