VIDEO: విడిది కేంద్రంగా గూడూరు అంగన్వాడీ కేంద్రం

జనగామ: అంగన్వాడీ కేంద్రం అతిథి గృహంగా మారిన ఘటన శుక్రవారం పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా గర్భిణీలకు, చిన్నారులకు అంగన్వాడీ సేవలు అందడం లేదని, అంగన్వాడీ టీచర్ భువనేశ్వరి దేవి తమ సన్నిహితులకు అప్పగించారని, అందులోనే మందు, విందులు నిర్వహిస్తూ ఉన్నారని స్థానిక గర్భిణీ స్త్రీలు తెలిపారు.