నేడు హుజూరాబాద్‌లో పవర్ కట్
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్ విద్యుత్ ఏఈ యం.శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్ల దీనికి హుజూరాబాద్ పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.