వందేళ్ల చరిత్రలో.. ఐదేళ్లే బ్రిడ్జి ప్రయాణం!

MLG: జిల్లాలో ఏటూరునాగారం మండలంలో దొడ్ల-మల్యాల మధ్య జంపన్నవాగు మళ్లీ పొంగి 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందేళ్ల చరిత్రలో ఆ గ్రామాలు ఐదేళ్లు మాత్రమే బ్రిడ్జిపై ప్రయాణాలు చేశారనేది గమనార్హం. 2018లో బ్రిడ్జి కట్టగా, 2023లో వరదలకు కూలింది. అంతకు ముందు వాగు పొంగితే క్యారీ బ్యాగుల్లో గాలి నింపి, తెప్పలు, తాళ్లతో వాగు దాటేవాళ్లమని చెప్పారు.