పీసీసీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం
NZB: పీసీసీ అధ్యక్షులుగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలో మహేష్ కుమార్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాంపల్లి, ఎడ్ల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.