ప్రాథమిక పాఠశాలలో చాచా నెహ్రూ జయంతి వేడుకలు
NLG: నల్లగొండ మండలం గుట్ట కింద అన్నారం ప్రాథమిక పాఠశాలలో చాచా నెహ్రూ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రు బాలల పట్ల చూపించిన ప్రేమను, దేశానికి అందించిన సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.