సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కిటకిట

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కిటకిట

VZM: కొత్తవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శనివారం వినియోగదారులతో కిటకిటలాడింది. ఫిభ్రవరి ఒకటి నుంచి భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం చుట్టూ గుమిగూడారు. గతంలో చేసుకొన్న ఒప్పందాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎంత మేరకు పెరుగుతాయనే ప్రభుత్వం నుండి ఆదేశాలు రావాల్సి ఉంది.