లారీ-ఆటో ఢీ.. వలస కూలీ మృతి
MHBD: మరిపెడ మండలం తానంచర్ల శివారు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన ఓ వలస కూలీ మృతి చెందాడు. మామిడితోటలో పని ముగించుకుని ఆటోలో వస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.