VIDEO: 60 అడుగులకు వరద చేరేవరకు పినపాక మండలం సేఫ్

BDK: గోదావరి వరద ప్రభావం 60 అడుగులు చేరేవరకు పినపాక మండలానికి ఎటువంటి వరద ముప్పు ఉండదని పినపాక తాహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. గురువారం ఆయన పినపాక మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లుగా తెలియజేశారు . టీ కొత్తగూడెం, చింతల బయ్యారం వంటి గ్రామాల్లో పర్యటించి అక్కడ వరద పరిస్థితిని పరిశీలించామని తెలిపారు.