20వ విగ్రహ ప్రతిష్ట మహోత్సం
VZM: విజయనగరం స్థానిక పూల్ బాగ్‌లో ఫిబ్రవరి 18, 19, 20వ తేదీలలో శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. 20వ తేదిన శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సంలో భక్తులు పాల్గొనాలని కోరారు.