వృద్ధుడిని రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్లిన కుటుంబ సభ్యులు

W.G: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధుడిని కుటుంబ సభ్యులు సోమవారం తణుకు రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్లిపోయారు. సజ్జాపురం ప్రాంతానికి చెందిన ముత్యాల పల్లపురాజు గత కొంతకాలంగా షుగర్ వ్యాధి కారణంగా కాలికి పుండు ఏర్పడింది. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న పల్లపురాజును కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్‌లో వదిలి వెళ్ళినట్లు రైల్వే సిబ్బందికి తెలిపారు.