రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
MDK: నర్సాపూర్ సబ్‌స్టేషన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు ఆటోను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి చేతులు విరిగి తీవ్ర రక్తస్రావం కాగా, స్థానికులు 108కి సమాచారం అందించారు. సిబ్బంది అలీముద్దీన్, సురేష్ వెంటనే స్పందించి క్షతగాత్రుడిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.