ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న గ్రీవెన్స్ డేలో భాగంగా ప్రజల సమస్యలు, అర్జీలు స్వీకరించి, సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.