పాత్రికేయులు ప్రజాపక్షంగానే పనిచేయాలి: ఎమ్మెల్యే

WNP: పాత్రికేయులు (జర్నలిస్టులు) ఎప్పటికీ ప్రజాపక్షంగానే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికై వారదులుగా కావాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పాత్రికేయుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు పార్టీలకతీతంగా పనిచేయాలి, జర్నలిస్టు కుటుంబాలకు భీమా చేస్తానని హామీ ఇచ్చారు.